పైళ్ల శేఖర్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలి: సీఎం కేసీఆర్

నల్లగొండ: తెలంగాణ సాధన కోసం ఇదే మైదానంలో అనేక సభలు పెట్టినమని భువనగిరి నియోజకవర్గస్థాయి సభలో సీఎం కేసీఆర్ అన్నారు. సభలో సీఎం మాట్లాడుతూ..సంక్షేమ పథకాలన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయి. రైతాంగానికి 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నం. రైతు బంధు పథకం కింద వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.10 వేలు ఇస్తమన్నారు. కాళేశ్వరం నీళ్లతో భువనగిరిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరిస్తమని సీఎం స్పష్టం చేశారు. మాధవరెడ్డి నాకు ఆత్మీయ మిత్రుడు. మాధవరెడ్డి చేసిన సేవ మరువలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. పైళ్ల శేఖర్ రెడ్డిని కూడా నియోజకవర్గ ప్రజలు దేవుడిలా భావిస్తున్నరని అన్నారు. ప్రజలంతా ఆశీర్వదించి శేఖర్ రెడ్డిని గెలిపించాలని సీఎం కోరారు.

Related Stories: