టీఆర్‌ఎస్‌కే మా ఓటు.. ఈటలకే మా మద్దతు

కమలాపూర్: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని, హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను గెలిపిస్తామని పద్మశాలి కులస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెంలో పద్మశాలి కులస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటాల వద్ద ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్‌ఎస్‌కే మా ఓటు అని ప్రతిజ్ఞ చేశారు. ఈ నెల 9న వంగపల్లిలో రజకులు ఈటల రాజేందర్‌కే మా ఓటు అని బహిరంగంగా ప్రకటించి తీర్మానం చేసిన విషయం విదితమే. ఇదే దారిలో గ్రామాల్లోని కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తూ ముందకు వస్తుండడంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం గ్రామ అధ్యక్షుడు పొరండ్ల కృష్ణప్రసాద్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు పోరండ్ల వైకుంఠం, నాయకులు ఆనందం, జయపాల్, మురళి, జయచందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Stories: