ఈ స‌మ‌స్య‌లున్న‌వారు బొప్పాయి పండును తిన‌రాదు తెలుసా..?

బొప్పాయి పండు తింటే మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక డెంగీ వ‌చ్చిన వారు ప్లేట్‌లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ర‌క్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండును ఆరోగ్యంగా ఉన్న ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. కానీ కింది స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మాత్రం అస్స‌లు ఆ పండును తిన‌కూడ‌దు. మ‌రి ఆ అనారోగ్య స‌మ‌స్య‌లు ఏమిటంటే... 1. గ‌ర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి ప‌రిస్థితుల్లో తిన‌కూడ‌దు. ఎందుకంటే ఇందులో ఉండే ప‌లు ర‌సాయ‌నాలు నేరుగా గ‌ర్భాశ‌యంపై ప్ర‌భావం చూపుతాయి. దీంతో అబార్ష‌న్ జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక బొప్పాయి పండును గ‌ర్భిణీలు తిన‌రాదు. 2. మ‌నం తిన్న ఆహారాన్ని నోటి నుంచి జీర్ణాశ‌యానికి అన్న‌వాహిక చేర‌వేస్తుంది. అయితే బొప్పాయి పండు వ‌ల్ల కొంద‌రిలో ఈ అన్న‌వాహిక దెబ్బ తిన‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహిక‌కు ఎఫెక్ట్ అవుతుంది. క‌నుక వారు ఈ పండును తిన‌రాదు. 3. గ‌ర్భిణీలే కాదు, పాలిచ్చే త‌ల్లులు కూడా బొప్పాయి పండును తిన‌రాదు. తింటే వారు ఇచ్చే పాల‌తో ప‌లు ర‌సాయ‌నాలు బిడ్డ శ‌రీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువుల‌కు లోపాల‌ను క‌లిగిస్తాయి. అనంత‌రం అవి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయి. క‌నుక పాలిచ్చే త‌ల్లులు కూడా బొప్పాయి పండును తిన‌రాదు. 4. బొప్పాయి పండు కొంద‌రికి ప‌డ‌దు. అల‌ర్జీని క‌లిగిస్తుంది. క‌నుక ఎవ‌రు ఈ పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని ఫ‌ర‌వాలేదు అనుకుంటేనే తిన‌డం ఉత్త‌మం. 5. బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తిన‌రాదు. తింటే స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతుంది. 6. బొప్పాయి పండును తినే పురుషులు వాటి విత్త‌నాల‌ను తిన‌కుండా, అవి లోప‌లికి పోకుండా జాగ్ర‌త్త ప‌డాలి. ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశ‌నం చేస్తాయి. 7.బొప్పాయి పండును ఎవ‌రైనా చాలా త‌క్కువ‌గా తినాలి. రోజూ తిన‌వ‌చ్చు కానీ ఒక క‌ప్పు మించ‌కూడ‌దు. మించితే శ‌రీరంలో బెంజైల్ ఇసోథ‌యోస‌య‌నేట్ అనే విష ప‌దార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీయ‌వచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా క‌లుగుతుంది.

Related Stories: