మ్యూచువల్ ఫండ్స్ లో 5 శాతమే..

ఇక నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) నిధుల్లో 5 శాతానికి మించి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడానికి వీలులేదు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఈ మేరకు పెన్షన్ ఫండ్ మేనేజర్లకు ఆదేశాలను జారీ చేసింది. పెన్షన్ ఫండ్ మేనేజర్లు కేవలం మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసి చేతులు దులుపుకోకుండా తమ ఇన్వెస్ట్‌మెంట్ నైపుణ్యాలను ఉపయోగించి మంచి ఈక్విటీ షేర్లలో మదుపు చేయడమే ఈ ఆదేశాల ఉద్దేశ్యమని పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ తెలిపారు.

ఈక్విటీ మ్యూచువల్‌ఫండ్లలో మదుపు చేసి వాటిని అలాగే వదిలేస్తున్నారనీ, అలాకాకుండా మరింత ప్రయోజనకారిగా ఉండేలా షేర్లను ఎంపిక చేసి మదుపు చేయడం ద్వారా అధిక రాబడులు అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఫండ్ల మేనేజర్లు మ్యూచువల్ ఫండ్లను ఒక సులభమైన మదుపు మార్గంగా భావిస్తున్నారనీ, కొంత మంది 10నుంచి 15 నిధులను ఈక్విటీ మ్యూచువల్‌ఫండ్లలో మదుపు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ధోరణికి స్వస్తి పలకాలన్నదే తమ ఉద్ధేశ్యమని ఆయన అన్నారు. ఈక్విటీలు, రుణ సాధనాలతో పోర్టుఫోలియోను వివిధీకరిస్తూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకరణ రాబడులను అందించాల్సి ఉంటుంది. ఈక్విటీల్లో 75 శాతం వరకు మదుపు చేసే ఆప్షన్‌ను ఎంచుకునే వీలును కల్పిస్తూ పీఎఫ్‌ఆర్‌డీఏ విధాన ప్రకటన చేసింది.

Related Stories: