విజేతగా శక్తి క్యాలిటీ సర్కిల్ జట్టు

జ్యోతినగర్: ఎన్టీపీసీ ఈడీసీ ఆడిటోరియంలో ఉద్యోగుల నైపుణ్యతపై రెండురోజుల పాటు జరిగిన 20వ ప్రాజెక్టు లెవెల్ క్వాలిటీ సర్కిల్ కన్వెన్షన్-2019లో శక్తి క్వాలిటీ సర్కిల్ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం 13 క్వాలిటీ సర్కిల్ జట్లు ప్రజెంటేషన్ చేయగా ఆపరేషన్ విభాగానికి చెందిన శక్తి క్యాలిటీ సర్కిల్ జట్టు అత్యంత నైపుణ్యత కనబర్చి గెలుపొందింది. రన్నర్‌గా ప్రథమస్థానంలో స్పార్క్ క్వాలిటీ సర్కిల్(సీఅండ్‌ఐ), ద్వితీయ రన్నర్‌గా పవర్(ఎలక్ట్రికల్ మెయింటెన్సీ) క్వాలిటీసర్కిల్ జట్టు నిలిచింది. అనంతరం బుధవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటీవ్ సీజీఎం మ్యాథ్యూవర్గీస్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలరే అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ టెక్నికల్ సర్వీసెస్ జీఎం పీకే లాడ్, ఆపరేషన్ జీఎం బిష్ణు చరణ్ పోలై, మెయింటెన్సీ జీఎం సౌమేంద్రదాస్, ఉన్నతాధికారులు ఉన్నారు. బిజినెస్ ఎక్స్‌లెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజెంటేషన్‌కు న్యాయనిర్ణేతలుగా క్వాలిటీ సర్కిల్ ఫోరం అఫ్ ఇండియా ప్రతినిధులు హన్మంతరావు, ఆరీఫ్‌ఖాన్‌లు వ్యవహరించారు.
More