మొక్కలను సంరక్షించుకోవాలి

కలెక్టరేట్: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణారెడ్డి పిలుపునిచాచరు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా టిన మొక్కలను రక్షించుకుంటే అవి వృక్షా లుగా మారి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయని వివరించారు. పచ్చదనం పర్చుకునేలా మొక్కలను నాటి రక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిధిలో పని చేస్తున్న హోంగార్డులకు పలు రకాల సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐతరాజ్‌పల్లిలో.. సుల్తానాబాద్‌రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారంలో భాగంగా ఐతరాజ్‌పల్లి గ్రామంలోని కురుమ సంఘం యువకుల ఆధ్వర్యంలో మంగళవారం బీరన్న ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం ఆ సంఘం యువకులు మాట్లాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మడ్డి సాయికిశోర్, కురుమ సంఘం యువకులు లింగయ్య,సంపత్, కుమార్, సంతోష్, అశోక్, స్వామి, రాజు తదితరులు ఉన్నారు.
More