విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పద్మప్రియ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం నగదు ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. 2018-19 విద్యాసంవత్సరంలో 7,8,9వ తరగతి వార్షిక ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ట్రస్టు సభ్యులు సమిండ్ల స్రవంతి-కిరణ్‌కుమార్ నగదు పంపిణీ చేశారు. ఏడో తరగతిలో నలుగురు బాలురు, బాలికలకు ఒక్కొక్కరికి 500 చొప్పున, 8వ తరగతిలో ఇద్దరు బాలురు, బాలికలకు ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున, 9వ తరగతిలో ఇద్దరు బాలురు, బాలికలకు ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. అలాగే సమిండ్ల రాజయ్య జ్ఞాపకార్థం రంగారావు 6వ తరగతి విద్యార్థులకు తెలుగులో ఒక్కొక్కరికి 500 చొప్పున నలుగురికి, ఇంగ్లిష్‌లో ఒక్కొక్కరికి 500 చొప్పున ఆరుగురికి నగదు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
More