అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

-పేదలకు అండగా సీఎం కేసీఆర్ -మత్స్యకారుల అభ్యున్నతికే చేపల పెంపకం -గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి మన ఊరుకు శ్రీకారం -టీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే కొండంత బలం -విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి -రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ -దొంగతుర్తి, ఖిలావనపర్తి, ధర్మారం గ్రామాల్లో విస్తృత పర్యటన -చెరువులో చేపపిల్లల విడుదల, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం -సీఎంఆర్‌ఎఫ్, కల్యాణ లక్ష్మి, రైతు బీమా చెక్కుల పంపిణీ ్త గ్రాధర్మారం : నిరుపేదల సంక్షేమం, అభివృద్ధే త మ ప్రభుత్వ ధ్యేయమనీ, అభాగ్యులకు అండగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ధర్మారం మండల కేంద్రంతోపాటు దొంగతుర్తి, ఖిలావనపర్తిలో మంత్రి కొప్పుల సోమవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఖిలావనపరిఅభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంమంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించగా, ఆలయ అర్చకులు, ఈఓ మారుతి మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌వై మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ కట్టిన ముడుపును, మంత్రి ఈశ్వర్ దేవుడికి సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రిని ఈఓ మారుతి ఘనం గా సన్మానించారు. ఆ తర్వాత మంత్రి కొప్పుల దొంగతుర్తి గ్రామంలో పర్యటించి యాదవ, పద్మశాలీ, గౌడ కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. పెద్ద చెరువులో మత్స్య శాఖ తరపున జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశంతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంగతుర్తి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి కొప్పుల మన ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, పరిష్కరించారు. అనంతరం ఖిలావనపర్తి గ్రామంలో పర్యటించి, ఐకేపీ స్థలంలో పెద్దపల్లి ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ కుమారి మనీషా రాథోడ్‌తో కలిసి హరితహారం మొక్కలు నాటారు. గ్రామంలోని ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన కల్యాణ మండపంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఆయా సందర్భాల్లో మంత్రి కొప్పుల మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను జోడెద్దుళ్లాగా ముందుకు తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం.. గత ప్రభుత్వాల పాలనలో మత్స్యకారులు నిరాధరణకు గురయ్యారనీ, తెలంగాణ ఏర్పాటు తర్వాతే వారి ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మత్స్యకారులను ఆదుకోవడానికి అవసరమైన సామగ్రిని, పరికరాలు, మోపెడ్లు, వాహనాలు అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారులంతా ఆర్థికంగా ఎదగాలనే తపనతో సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో చేప పిల్లలను పోయడానికి ఈ నెల 16 నుంచి ప్రభత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దొంగతుర్తి పెద్దచెరువులో 20 వేల చేప విత్తనాలు పోసినట్లు చెప్పారు. విత్తనాలుగా పోసిన చేపలు పెరిగి, మత్స్యకారులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి ఈశ్వర్ ఆకాంక్షించారు. మన ఊరు కు శ్రీకారం.. దొంగతుర్తి గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో మన ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, భూ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజల విన్నపానికి జవాబుదారీగా ఉండేలా మన వూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని రెవెన్యూ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని తాసిల్దార్ సంపత్‌ను మంత్రి ఆదేశించారు. దొంగతుర్తి నుంచి కాచాపూర్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని పీఆర్ ఏఈ సుధాకర్‌ను ఆదేశించారు. పలువురు బీడీ కార్మికులు తమకు పింఛన్లు మంజూరు చేయాలని విన్నవించగా, సంబంధిత శాఖ అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి, మంజూరు చేయించారు. గ్యాస్ కనెక్షన్ కోసం విన్నవించిన వృద్ధురాలికి, తానే స్వయంగా కొనిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పలు సమస్యలు పరిష్కారం కోసం సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఎంపీటీసీ దాడి సదయ్య వినతి పత్రాలు అందజేయగా, వాటి పరిష్కారం చేసే బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి అండ.. కార్యకర్తలే పార్టీకి అండఅనీ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కోరారు. కష్ట పడి పని చేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ నెల 20లోగా పార్టీ గ్రామ కమిటీలను ప్రకటిస్తామనీ, త్వరలోనే మండల కమిటీలనూ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. పేదలకు అండగా.. పేదలకు అండగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో 62 మంది లబ్ధిదారులకు రూ. 57,82,192 విలువైన చెక్కులను అందించారు. ఖిలావనపర్తికి చెందిన ఎడ్ల మహేందర్, ఈర్ల వెంకటేశం అనే రైతులు ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. నియోజక వర్గానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు రూ.11,78,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఏఎంసీ చైర్‌పర్సన్ గుర్రం లలిత, వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, జిల్లా, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దిన్, ఎండీ రఫీ, నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ పూస్కూరు నర్సింగారావు, ఆయా గ్రామాల సర్పంచులు పాలకుర్తి సత్తయ్య, సాగంటి కనకతార, ఎంపీటీసీలు దాడి సదయ్య, మోతె సుజా త, తుమ్మల రాంబాబు, ఉపసర్పంచులు ముత్యా ల చంద్ర శేఖర్, కీసరి స్వరూప, ఆవుల లత, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పాకాల రాజ య్య, మండల కోఆర్డినేటర్ పెంచాల రాజేశం, నాయకులు బలరాం రెడ్డి, పీ రామారావు, పాక వెంకటేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.
More