టీ వాలెట్‌ను వినియోగించుకోవాలి

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ వాలెట్ (తెలంగాణ వాలెట్)ను చౌకధరల దుకాణాదారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లకు టీ వాలెట్‌పై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ టీ వాలెట్‌ను ఉపయోగించుకుని డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. టీ వాలెట్‌తో రేషన్ బిల్లులు చెల్లించవచ్చని, ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా పూర్తిగా ఉచితంగా సేవలు పొందవచ్చన్నారు. నగదు జమ చేయవచ్చని, మొబైల్ రీచార్జి, డీటీహెచ్, ఇంటర్నెట్ బిల్లులతో పాటు బస్ టికెట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చన్నారు. టీ వాలెట్‌ను ఉపయోగించడం ఎంతో సులభమని, దీని ద్వారా చౌకధరల దుకాణాదారులు అదనపు ఆదాయం కూడా పొం దవచ్చన్నారు. రేషన్ సరుకులు తీసుకునే వినియోగదారుల వివరాలను డీలర్లు ప్రతినెలా జాబితా సమర్పించాలన్నారు. కార్డు వినియోగదారులు మ రణించినట్లయితే వారి జాబితా, ప్రతినెలా సరుకులు పొందే వారి జాబితాను జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో అం దజేయాలన్నారు. అలాగే పేద లకు అందాల్సిన బియ్యం, తదితర నిత్యావసర సరుకులు ధనవంతులు పొందుతున్నట్లయితే వారి జాబితా కూడా తయారు చేసి ఇవ్వాలన్నారు. ధనవంతులంటే పట్టాదారు భూస్వాము లు, కార్లు కలిగి ఉన్న వారు, సొంత భవనాల్లో నివసిస్తూ రేషన్ సరుకులు తీసుకుంటున్న వారి జాబితా తయారు చేసి ఇవ్వాలన్నారు. త్వరలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటాలని, పరిసరాల పరిశుభ్రత పా టించాలని, ప్లాస్టిక్ కవర్లను వాడవద్దన్నారు. రేషన్ వినియోగదారులు చేతి సంచితో వస్తేనే సరుకులు ఇవ్వాలన్నారు. అనంతరం టీ వాలెట్ ఉపయోగించే పద్ధ్దతులు, నిర్వహణపై ట్రాన్జాక్షన్ అనలిస్టు రాజేశ్ చౌకధరల దుకాణాదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, నాయబ్ తాసిల్దార్ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
More