మున్సిపల్ చట్టంతో జవాబుదారీతనం

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: తెలంగాణ సర్కారు తీసుకువచ్చిన కొత్త మున్సిపల్ చట్టం నిరుపేద ప్రజలకు ఓ ఆయుధంగా మారతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. అసెం బ్లీలో చట్టంపై చర్చలో మాట్లాడుతూ పట్టణాల్లో పేదల సమస్యలు తెలుసుకొని సీఎం కేసీఆర్ కొత్త చట్టం తీసుకురావడంపై కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీల్లో ఏకీకృత సర్వీసు సాహసోపేత నిర్ణయమని, దీనివల్ల ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతందన్నారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణాలకు రూపాయి ఫీజు చెల్లిం చి కట్టుకొవచ్చని పేర్కొనడం, ఆస్తి పన్ను కూడ రూ. 100 నిర్ణయించడం సంతోషకరమన్నారు. నగరాలు, పట్టణాల్లో ముఖ్యంగా డంప్‌యార్డులు తీవ్రసమస్యగా ఉందని, దీనిపై ప్రభుత్వం ద్వా రానే నిధులు కేటాయించి ప్రస్తుతం ఉన్న డంప్‌యార్డులను క్లియర్ చేయాలని కోరారు. పట్టణాల్లో వెండింగ్ జోన్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఇష్టారాజ్యంగా వీధి వ్యాపారాలతో ట్రా ఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయన్నారు. నగరంలోని ఖాళీ స్థలాల విషయంలోనూ చర్యలు తీసుకోవాలన్నారు. వీటిల్లో ఆయా యజమాన్యులకు నోటీసు ఇచ్చి చర్యలు చేపట్టాలని, వారు స్పందించకపోతే వాటిని స్వాధీనంలోకి తీసుకొవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో ఫంక్షన్ హాళ్లకు పార్కింగ్ స్థలాలు లేవని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌ను జనాభాకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలన్నారు. డివిజన్ కమిటీల నియమాకాన్ని తప్పనిసరి చేయాలని, ప్రతి వారంలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు పెట్టి వాటి మినిట్స్‌ను కమిషనర్ సమావేశ అనంతరం బహిర్గతం చేసేలా చట్టంలో పొందుపర్చాలన్నారు. అలాగే ప్రతి నెలా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్లాట్స్ అవుట్స్ లేకుం డా చేసే వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
More