చిట్టీల పేరిట మోసం

కరీంనగర్ క్రైం : చిట్టీల పేరుతో రూ.2 కోట్లకు టోకరా వేసిన వేశాడు కరీంనగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇంటికి తాళం వేసి జారుకోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన బచ్చ కుమారస్వామి 20 ఏళ్ల క్రితం ఓ ప్రైవేట్ బట్టల దుకాణంలో పనిచేశాడు. అందరితో కలుపుగోలుగా ఉండే కుమారస్వామికి ఆర్టీసీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయాడు. అయితే పాత పరిచయాలను అవకాశంగా మలుచుకుని చిట్టీలు నడిపిస్తున్నాననంటూ అందరినీ నమ్మించాడు. అతని మాటలు నమ్మి చాలా మంది చిట్టీలలో సభ్యులుగా చేరి పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించారు. అయితే కాలపరిమితి ముగిసినా కుమారస్వామి చిట్టీ డబ్బులు ఇవ్వకపోగా సమయం దా టవేస్తూ వచ్చాడు. ఇలా బాధితుల సంఖ్య, చెల్లిం చే సొమ్ము పెరిగిందే తప్ప ఏ ఒక్కరికీ డబ్బులు చెల్లించలేదు. ఈ నెల 15న అందరికీ డబ్బులు చెల్లిస్తానంటూ వాయిదాలు పెట్టాడు. బాధితులంతా ఈనెల 15న కుమరస్వామి ఇంటికి వెళ్లేసరికి తాళం వేసి ఉండడంతో రెండు రోజులు అతని కోసం వెతికి చివరికి సీపీని ఆశ్రయించారు. జరిగిన మోసాన్ని లిఖిత పూర్వకంగా 14 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలు తెలుసుకున్న సీపీ విచారణ చేసి, కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
More