కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం

గోదావరిఖని టౌన్ : నగర పాలక సంస్థ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఇక మిగిలింది రిజర్వేషన్ల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్లపై ఎదురుచూస్తున్నారు. రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ తదితర కులాల వారీగా ఓటర్ల జాబితాను తుది ప్రకటన ప్రకటించారు. కార్పొరేషన్‌లో మహిళలు 85075, పురుషులు 88,614, ఇతరులు 25 మంది ఓటర్లు మొత్తం 1,73,714 ఓటర్లుగా ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. వీటితోపాటు 50 డివిజన్లలో డివిజన్ వారీగా కులాలవారీగా ఓటర్ల సంఖ్యను ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు 50 డివిజన్లలో 17 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలోని ఇరిగేషన్, రెవెన్యూ, విద్య, అగ్రికల్చర్ అధికారులను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా 17 మందిని జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలోని అధికారులను నియమించారు. వీరిలో డివిజన్ల ఓటర్ల సంఖ్యను బట్టి రెండు నుంచి మూడు, నాలుగు డివిజన్లతో ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. అలాగే, కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు 800 మంది ఓటర్ల సంఖ్యకు తగ్గకుండా 235 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఓటర్లకు కనీస వసతులు కల్పించే విధంగా ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నగర పాలక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కార్పొరేషన్ కార్యాలయంలో దాదాపు సిబ్బంది అధికారులందరు ఏదోక ఎన్నికల నిర్వహణ పనిలో నిమగ్నమయ్యారు. నేడు, రేపు కొత్త మున్సిపల్ చ ట్టం బిల్లును అసెంబ్లీలో ఆమోదించాక కొత్త చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణ వచ్చే నియమ నిబంధనలతో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారుల సమాయత్తంగా ఉన్నారు.
More