అనాథ పిల్లలను ఆదరించడం అభినందనీయం

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : విధి వంచితులైన ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీసి, ఆదరిస్తున్న ఎండీహెచ్‌డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమ నిర్వాహకుడు రాజయ్య అభినందనీయుడని మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్‌ఐ విజయేందర్- సృజన దంపతులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ విజయేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం గోదావరిఖని గాంధీనగర్‌లో గల ఎండీహెచ్‌డబ్ల్యూఎస్ అనాథ పిల్లలను సందర్శించారు. ఈ సందర్భంగా అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పిల్లలకు అన్నదానం నిమిత్తం 25 కిలోల బియ్యం, నోట్‌బుక్స్ అందజేశారు. ఇక్కడ ఎస్‌ఐ మాట్లాడుతూ తన జన్మదినం వేడుకకు వృథా ఖర్చులు చేయవద్దనే మంచి ఆలోచనతో ఈ ఆశ్రమాన్ని సందర్శించి పిల్లలకు చేయూత ఇచ్చినట్లు చెప్పారు. ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్యకు తనవంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో జైపూర్ పోలీస్ సిబ్బంది, ఆశ్రమ నిర్వాహకులు రాజయ్య, భూలక్ష్మి, రాజు, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
More