సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి

ధర్మారం: సమస్యల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులు శ్రద్ధ చూపాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ సూచించారు. మండల స్థాయిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో ధర్మారంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆమె బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర సం క్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో సమస్యలు పరిష్క రించి ముందుకెళ్తానని వివరించారు. వైద్యశాఖ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వానా కాలంలో సీజనల్ వ్యాధులు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకు ప్రత్యేక శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యం పనులు చేపట్టాలని వివ రించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం విజయవంతానికి ఉపాధి హామీ సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించాలనీ, అందుకు ఫీల్డు అసిస్టెంట్లు శ్రద్ధ వహించే విధంగా ఆ శాఖ అధికారులు చూడాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని పేర్కొన్నా రు. ఆరోగ్య కిట్లపై బాలికలకు పాఠశాలల్లో మహిళ ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని వివరించారు. పశువులకు వ్యాధులు సోకకుండా ఆ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు అన్ని గ్రామాలకు అవాంతరాలకు లేకుండా సరఫరా అయ్యేలా ఆ శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఏమైన క్లిష్టమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండల శాఖ అధికారులు శాఖల విధులపై వివరించారు. సమావేశంలో ఎంపీడీఓ డి.బాలరాజు, తాసిల్దార్ పి.సంపత్, నాయబ్ తాసిల్దార్ కల్లెం శ్రీనివాస్‌రెడ్డి, మండల వైద్యాధికారి సంపత్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ మధు, ఎంఈఓ పినుమల్ల ఛాయాదేవి, ఉపాధి హామీ ఏపీఓ నాడెం రవి, సెర్ప్ ఏపీఎం కనకయ్య,అంగన్‌వాడి సూపర్ వైజర్ జమున, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, టీఆర్‌ఎస్ నాయకుడు ముత్యాల బలరాంరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
More