స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ పేటీఎం మాల్ పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్లు ఒప్పో, మోటరోలా, హానర్ తదితర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై కనీసం 15శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్లు వర్తించే మొబైల్ మోడల్స్ ఇవే.. ఒప్పో ఎఫ్5 యూత్, ఒప్పో ఎఫ్7, మోటోజీ6, మోటో జీ6ప్లే, హానర్ 9లైట్, హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్లకు క్యాష్‌బ్యాక్ వర్తించనుంది. ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసిన 24 గంటల తరువాత క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని పేటీఎం వాలెట్‌లో జమచేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. క్యాష్‌బ్యాక్ పొందాలనుకుంటే ఆయ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ప్రోమో కోడ్‌లను ఎంటర్ చేయాలని పేర్కొంది. పూర్తి వివరాలకు, షరతుల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు