ఫిలిం ఛాంబర్ నుండి వెళ్లిపోయిన పవన్

శ్రీ రెడ్డి వివాదంలో తన తల్లిని దూషించటంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గత రాత్రి వరుస ట్వీట్స్ చేసిన పవన్ ఈ రోజు ఉదయం తన తల్లిని తీసుకొని ఫిలిం ఛాంబర్ కి వెళ్లారు. పవన్ వచ్చిన కొద్ది సేపటికి నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా అక్కడికి చేరుకున్నారు. వినాయక్,మారుతి, శివ బాలాజీ,పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, మెహర్ రమేష్ తదితరులు పవన్ని సపోర్ట్ చేస్తూ ఛాంబర్ కి వెళ్ళారు. అయితే మెగా ఫ్యామిలీ అంతా ఫిలిం ఛాంబర్ కి వచ్చారని తెలుసుకున్న అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో శాంతి భద్రతల సమస్య నెలకొంది. ఈ పరిస్థితులలో పోలీసుల సూచనతో పవన్ మరియు మెగా ఫ్యామిలీ ఫిలిం ఛాంబర్ నుండి వెళ్లిపోయారు. అయితే ఒక్క రోజు గడువు ఇచ్చిన పవన్ తన నిరసన కి తాత్కాలిక బ్రేక్ వేసారు. మా నుండి ఎలాంటి ప్రకటన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ చెప్పినట్టు సమాచారం. పవన్ తల్లిని దుర్భాషలాడిన క్రమంలో కుట్ర దారులకి శిక్ష పడాలని ఆయన చేసిన డిమాండ్ విషయంలో సపోర్ట్ ఫుల్ గా పెరుగుతుంది. సినీ పరిశ్రమకి సంబంధించిన స్టార్స్ అందరు తమ ట్విట్టర్ ద్వారా పవన్ కి మద్ధతు తెలియజేస్తున్నారు.

Related Stories: