నేను ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు:పవన్ కళ్యాణ్

హైదరాబాద్: త్వరలో తాను సినిమా చేయబోతున్నట్లు వచ్చిన వార్తలపై జనసేన అధినేత, ప‌వ‌ర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ స్పందించారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల్లో నిజంలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలపలేదని వివరించారు. సినిమాల్లో నటించేందుకు అవసరమైన సమయం ప్రస్తుతం నా దగ్గర లేదని చెప్పారు. ప్రజా జీవితానికే పూర్తి సమయం కేటాయిస్తానని అన్నారు. ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిదని తెలిపారు. సినిమాలపై దృష్టిసారించడం లేదని స్పష్టం చేశారు. నా ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే.. నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమేనని జనసేన పార్టీ అధికారిక ట్విటర్ లేఖను పోస్ట్ చేశారు.

Related Stories: