'మా'ఛాంబ‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర‌స‌న‌

త‌న‌తో పాటు త‌న త‌ల్లిని దూషించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మా చాంబ‌ర్‌లో నిర‌స‌న చేప‌ట్టారు. కొద్ది సేప‌టి క్రితం త‌ల్లితో ఫిలిం ఛాంబ‌ర్ చేరుకున్న ప‌వ‌న్ .. మా అధ్య‌క్షుడు శివాజీ రాజా, సోద‌రుడు నాగబాబు, అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, ప‌లువురు లాయ‌ర్స్‌తో క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. మీడియా వ్య‌వ‌హార‌శైలిని దుయ్య‌ప‌డుతూ ప‌వ‌న్ ఈ నిర‌స‌న చేప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి కొద్ది నిమిషాల‌లో ప‌వ‌న్ కాని లేదంటే నాగ బాబు కాని మీడియాతో మాట్లాడ‌నున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే గ‌త రాత్రి త‌న ఫ్యామిలీపై అస‌భ్య‌క‌ర కామెంట్స్ చేసిన వారికి వ్య‌తిరేఖంగా ప‌వ‌న్ వ‌రుస ట్వీట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Related Stories: