పురీషనాళంలో కేజీ బంగారం.. స్మగ్లర్ అరెస్ట్

న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడుతున్న ప్రయాణికులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఓ ప్రయాణికుడు ఏకంగా తన పురీష నాళంలో కేజీ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 24 ఏళ్ల ప్రయాణికుడిపై అనుమానం రాగా.. అతని లగేజీ మొత్తాన్ని పరిశీలించారు. తర్వాత అతన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించగా.. పురీషనాళంలో 1.04 కేజీల బరువున్న 9 బంగారపు కడ్డీలను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. రూ.32 లక్షల విలువైన ఈ బంగారాన్ని సీజ్ చేసి.. అతన్ని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. మరో కేసులో బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నారంటూ ఓ భారతీయుడితోపాటు మరో ఫ్రెంచ్ జాతీయుడిని కూడా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరూ రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చారు. ఈ ఇద్దరి నుంచి సుమారు కేజిన్నర బంగారాన్ని సీజ్ చేశారు.

Related Stories: