ప్రకృతి ప్రసాదం.. బొప్పాయి

బొప్పాయిని చూడగానే నోరూరుతుంది. రుచిలోనే కాదు. ఆరోగ్యానికీ మంచి ఔషధం. బొప్పాయి పండు తింటే అంధత్వం దరి చేరదు. రోజూ తీసుకునే పండ్లలో బొప్పాయి ఉండేలా చూసుకోవాలి. దీంట్లో విటమిన్-ఏ, కేరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ప్రకృతి ప్రసాదం బొప్పాయితో ఉపయోగాలెన్నో.. నిత్యం తగు మోతాదులో బొప్పాయి పండును తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. కోడిగుడ్డు సొనతో కలిపి బొప్పాయి ముక్కల తీసుకుంటే నోటిపూత, కాలేయం పాడవడం వంటి రోగాలు, బుద్ధిమాంద్యం, శారీరక అలసట దరిచేరవు. తేనేలో కలిపి తీసుకుంటే గుండె, కాలేయం, నరాల్లో రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులూ రోజూ రెండు ముక్కలు తీసుకోవచ్చు. కడుపులో గడ్డలు, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది. మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. బొప్పాయి గింజల్లో ఉండే కార్టీసీమిన్ పదార్థం కడుపులోని సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. బొప్పాయి గింజలను ఎండబెట్టి, పొడిచేసి నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. ఆకులతోనూ మేలు.. బొప్పాయి ఆకుల్లో కార్విన్ అనే పదార్థం ఉంటుంది. కీళ్ల నొప్పులకు బొప్పాయి ఆకులను వేడిచేసి నొప్పి ఉన్న ప్రాంతంలో వేసి కట్టుకట్టాలి. ఆకుల రసంలో యాంటి సెప్టిక్ ఉంటుంది. ఈ రసాన్ని పుక్కిలిస్తే నోటిపూతతో పాటు ట్రాన్సిల్స్ తగ్గిపోతాయి. డెంగ్యూ వ్యాధి నివారణకు దీని ఆకుల రసం దివ్యౌ షధం. బొప్పాయి ఆకుల రసం తాగితే రక్తకణాలు( ప్లేట్‌లేట్స్) పెరుగుతాయి. పూలతో పేను కొరుకుడు మాయం.. బొప్పాయి పూలను మెత్తగా నలిపి పేను కొరికిన ప్రదేశంలో రాస్తే త్వరగా వెంట్రుకలు వస్తాయి. ప్రయోజనం.. పాలతో కూడిన పిచ్చి బొప్పాయిలో ఉండే పెఫైస్ అనే ఎంజైమ్ ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఈ కాయను కూర వండి తింటే ప్లీహగ్రంధి రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. 100 గ్రాముల బొప్పాయిలో ఉండే పోషకాలు.. శక్తి-179 కేలరీలు, కార్పోహైడ్రేట్లు 1082 గ్రాములు, షుగర్ 7,82 గ్రాములు, ఫైబర్ 1.7 గ్రాములు, ఫ్యాట్ 0.26 గ్రాములు, ప్రోటీన్లు 0.47 గ్రాములు, విటమిన్ ఏ, బీ,సీ, ఈ, కే లభిస్తుంది. కాల్షియం 20 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 21 మిల్లీd గ్రాములు, పాస్పరస్ 10 మిల్లిd గ్రాములు, పాస్పరస్ 10మిల్లీd గ్రాములు, సోడియం 8మిల్లీ d గ్రాములు, పోటాషియం 182 మిల్లీd గ్రాములు, జింక్ 0.08 మిల్లీ గ్రాములుంటుంది. వీరికి వద్దు.. * గర్భిణులు బొప్పాయి పండుకు దూరంగా ఉండటమే మేలు. దీనిలో ఉండే అపియేలే అనే పదార్థం వల్ల గర్భస్రావం అవుతుంది. * బాలింతలు కూడా తీసుకోకూడదు. * బొప్పాయిలోని పెపైన్, లేటెక్స్ కొంత మందికి ఎలర్జీని కలిగిస్తుంది. * సంవత్సరం లోపు పిల్లలకు బొప్పాయి పెట్టకూడదు.

Related Stories: