విశాల్ డైలాగ్‌కి ఈల వేసిన కీర్తి సురేష్‌

విశాల్, మీరా జాస్మిన్ కాంబినేషన్‌లో వచ్చిన పందెం కోడి బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా పందెం కోడి 2 తెర‌కెక్కుతుంది. త‌మిళంలో ఈ చిత్రం సంద‌కోళి 2 పేరుతో విడుద‌ల కానుంది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ లేడి విల‌న్‌గా క‌నిపించ‌నుంది. విశాల్ బ‌ర్త్‌డే( ఆగ‌స్ట్ 29న‌) సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని భావించ‌గా, హ‌రికృష్ణ మృతితో వాయిదా వేశారు. కొద్ది సేప‌టి క్రితం టీజ‌ర్ విడుద‌లైంది. పందెం కోడి చిత్రంలో విశాల్ చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ మొద‌లు కాగా, త‌ర్వాత సీక్వెల్‌కి సంబంధించి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చూపించారు.‘నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు. అడ్డుకోవడమే మొదలుపెట్టాను’ అని విశాల్‌ చెప్తున్న డైలాగ్‌కు..పక్కనే ఉన్న కీర్తిసురేశ్‌ ఈల వేయడం హైలైట్‌గా నిలిచింది. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య