ఇండియాతో మ్యాచ్.. పాకిస్థాన్ బ్యాటింగ్

దుబాయ్: ఏషియాకప్‌లో భాగంగా జరగనున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో ఇండియాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్. హాంకాంగ్‌తో ఆడిన టీమ్‌తోనే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బరిలోకి దిగుతున్నది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరుతో ఇండియాపై ఒత్తిడి తెస్తామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పాడు. అటు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నది. తొలి మ్యాచ్ ఆడిన శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్ స్థానాల్లో జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలను టీమ్‌లోకి వచ్చారు. టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని రోహిత్ చెప్పాడు. పిచ్ కాస్త స్లోగా ఉన్నా.. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇండియా, పాకిస్థాన్ తలపడటం ఇదే తొలిసారి.

Related Stories: