ఆసియా కప్: భారత్ విజయలక్ష్యం 238

దుబాయ్: భారత్, పాక్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ 50 ఓవర్లకు 237 పరుగులు చేసి 238 పరుగుల విజయలక్ష్యాన్ని భార‌త్‌ ముందుంచింది. ఆసియా క‌ప్ లో సూప‌ర్ 4 మ్యాచ్ ఇది. 7 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 237 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఆట‌గాళ్లు షోయబ్ మాలిక్ 78 పరుగులు, సర్పరాజ్ అహ్మద్ 44, జమాన్ 31, అసిఫ్ అలీ 30 పరుగులు చేసి జట్టుకు స్కోర్ అందించారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు చేర‌నుంది.

Related Stories: