వయోవృద్ధులకు ‘ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకం’

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వయోవృద్ధుల కోసం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీం కింద ప్రతీ నియోజకవర్గం నుంచి 1100 మంది వయోవృద్ధులకు ఉచిత తీర్థయాత్రకు వెళ్లే అవకాశం కల్పించనున్నారు. ఖర్చులన్నీ పూర్తిగా ప్రభుత్వమే భరించి తీర్థయాత్ర సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఇవాళ ఢిల్లీకి గొప్ప రోజు. వయస్సు మీద పడిన వృద్ధుల తీర్థయాత్ర కోసం ఈ కార్యక్రమం ప్రారంభించాం. ప్రతీ ఏడాది ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1100 మంది వృద్ధులకు తీర్థయాత్రకు తీసుకెళ్లనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం తక్కువగా ఉంటుంది. వృద్ధులకు తమ జీవితంలో ఒక్కసారైనా తీర్థయాత్రకు వెళ్లాలని కోరిక ఉంటుంది. వారి కోసం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ఒక్క మతానికో కాదని, అన్ని మతాలవారికి వర్తిస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Related Stories: