పద్మాదేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం

మెదక్ : టీఆర్ఎస్ నాయకురాలు పద్మాదేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ ఉదయం ప్రారంభించారు. పద్మాదేవేందర్ రెడ్డి చిన్న శంకరంపేట మండలంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. నర్సాపూర్ టిఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి వెల్దుర్తి మండలం రామంతపూర్ లో ప్రచారం నిర్వహించారు. అంతకుముందు మాసాయిపేటలోని రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీసంఖ్యలో కార్యకర్తలు..నాయకులు పాల్గొన్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?