8 చోట్ల పేలుళ్లు.. మృతుల సంఖ్య 207.. ఏడుగురు అరెస్ట్‌

కొలంబో: శ్రీలంక దేశ రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల దాడిలో సుమారు 207 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 450కి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుళ్లతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొలంబోలో ఓ ఇంటిపై దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అన్ని ఆస్పత్రుల నుంచి లభించిన వివరాల ప్రకారం సుమారు 207 మంది మరణించినట్లు నిర్ధారించాం. ఈ పేలుళ్లలో గాయపడిన 450 మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆదేశ పోలీస్‌ అధికార ప్రతినిధి రువాన్‌ గుణశేఖర పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది పేలుళ్ల జరగ్గా అందులో కొన్ని ఆత్మాహుతి దాడులున్నాయి. ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఇంటర్నెట్‌ సేవలు, సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ సైట్లు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లపై నిషేధం విధించారు. ఈస్టర్‌ వేడుకలు, విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం వరుసగా ఆరుపేలుళ్లు సంభవించాయి. అందులో మూడు చర్చిల వద్ద జరగ్గా.. మరో మూడు ప్రముఖ హోటళ్ల వద్ద జరిగాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
More in అంతర్జాతీయం :