5 నిమిషాల్లోనే 2 లక్షల రియల్ మి 2 అమ్మకాలు..!

ఒప్పో, అమెజాన్‌ల సంయుక్త బ్రాండ్ రియల్ ఇటీవలే రియల్ మి 2 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను ఈ నెల 4వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ నిర్వహించారు. ఈ క్రమంలో మొదటి 5 నిమిషాల్లోనే 2 లక్షల రియల్ మి 2 ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని రియల్ మి తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. ఇక రియల్ మి 2 ఫోన్‌కు గాను తదుపరి సేల్‌ను ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు కూడా రియల్ మి వెల్లడించింది. ఒప్పో రియల్ మి 2 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.
× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు