చదువుపై ఆసక్తి చూపుతున్న మాజీ నక్సల్స్

భువనేశ్వర్ : మాజీ నక్సల్స్ చదువుపై ఆసక్తి చూపుతున్నారు. తాము కూడా చదువుకుని ఉన్నతంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో లొంగిపోయిన 100 మంది నక్సల్స్ డిగ్రీలో ప్రవేశాల కోసం ఇవాళ పరీక్షలు రాశారు. ఇందిరా గాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో వీరు ప్రవేశం పొందనున్నారు. ఈ సందర్భంగా ఓ మాజీ నక్సల్ మాట్లాడుతూ.. సమాజంలో తాము కూడా ఒక భాగం కావాలని.. పోలీసుల ఎదుట లొంగిపోయామని పేర్కొన్నారు. అందులో భాగంగానే డిగ్రీ చదువుకునేందుకు ఇవాళ ప్రవేశ పరీక్షలు రాశామని తెలిపారు.

Related Stories: