టీఆర్ఎస్ లో చేరిన నేతలు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణానికి చెందిన ఎంఐఎం నేతలు టీఆర్ఎస్ లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంఐఎం నేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హైదరాబాదులోని ఎంపీ కవిత నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారు టీఆర్ఎస్ లో చేరారు. ఎంఐఎం సీనియర్ లీడర్ షేక్ బాసిత్, మాజీ కో ఆప్షన్ మెంబర్ షేక్ అలీముద్దీన్, షేక్ సాబీర్, వ్యాపారవేత్త మహమ్మద్ కబీర్ ఉద్దీన్, ఉర్దూ కవి షేక్ అహ్మద్ జియా టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ పార్టీలకతీతంగా నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, ఇది పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఐకమత్యంతో పార్టీ పటిష్టతకు పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్ తో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ లీడర్ అన్వర్ నిజామాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ అన్వర్ టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో అన్వర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తున్నాయని, దానిలో భాగంగానే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు అన్వర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.

Related Stories: