ఈ నెల 23న ఒప్పో ఆర్17 స్మార్ట్‌ఫోన్ విడుదల

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్17 ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

ఒప్పో ఆర్17 ఫీచర్లు...

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జ్.

× RELATED నిమిషంలో స్పందిస్తున్న ఐటీసెల్ పోలీసులు