ఒప్పో నుంచి ఎ7ఎక్స్ స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ7ఎక్స్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అక్కడ విక్రయించనున్నారు. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. రూ.21వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఒప్పో ఎ7ఎక్స్ ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్