ఒప్పో నుంచి ఎ73ఎస్ స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ73ఎస్ ను త్వరలో విడుదల చేయనుంది. రూ.20వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

ఒప్పో ఎ73ఎస్ ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ.

× RELATED రెసిడెన్షియల్ స్కూల్ నుంచి పరారయిన విద్యార్థులు