ఒప్పో ఎ3ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ3ఎస్ ను తాజాగా విడుదల చేసింది. రూ.10,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 15వ తేదీ నుంచి లభ్యం కానుంది. రెడ్, డార్క్ పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదలైంది. ఇక ఈ ఫోన్‌కు గాను 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను కూడా ఒప్పో లాంచ్ చేసింది. ఈ వేరియెంట్ ధరను రూ.13,990 గా నిర్ణయించారు.

ఒప్పో ఎ3ఎస్ ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

× RELATED త‌మ‌న్నా, సందీప్‌ల నెక్ట్స్ ఏంటి టీజ‌ర్