హైదరాబాద్‌లో వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్..!

మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి మంజీరా మాల్‌లో తన ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్‌ను తాజాగా ఓపెన్ చేసింది. దీంతోపాటు బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్, చెన్నైలోని టి నగర్‌లలోనూ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్లను వన్‌ప్లస్ ప్రారంభించింది. వీటితో దేశంలో ఉన్న వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్ల సంఖ్య 15కు చేరుకుంది. ఇక ఇవి కాకుండా ఈ ఏడాది చివరి వరకు టాప్ నగరాల్లో 25 ప్రీమియం ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్లను వన్ ప్లస్ ఓపెన్ చేయనుంది.

దేశ వ్యాప్తంగా వన్‌ప్లస్ 35 నగరాల్లో మల్టీ బ్రాండెడ్ పార్ట్‌నర్ సర్వీస్ సెంటర్లను కలిగి ఉంది. వీటిల్లో వన్‌ప్లస్ కస్టమర్లకు పికప్, డ్రాప్ సర్వీస్‌ను అందిస్తున్నారు. ఇక వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్లలో కస్టమర్లకు పలు ప్రత్యేకమైన సదుపాయాలను అందిస్తున్నారు. సదరు సెంటర్లలో కస్టమర్లకు కేవలం 1 గంటలోనే మెజారిటీ సమస్యలను పరిష్కరిస్తారు. ఇక స్టోర్స్‌ను ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. దీని వల్ల ఉద్యోగులు చాలా సులభంగా తమ తమ ఫోన్లను సర్వీస్ సెంటర్లకు తీసుకు వెళ్లవచ్చు. అలాగే రియల్ టైం సర్వీస్‌ను అందించే టెక్నిషియన్లు, గెస్ట్‌ల కోసం ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్, వీఐపీ జోన్, గేమ్స్ ఆడుకునే గేమ్ రూమ్ తదితర సదుపాయాలను వన్‌ప్లస్ తన ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్లలో అందిస్తున్నదని ఆ సంస్థ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ వెల్లడించారు.

Related Stories: