డిప్యూటీ ఈఈ కిశోర్‌సింగ్‌కు ఏడాది జైలుశిక్ష

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఈఈ కిశోర్‌సింగ్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 జూన్ 16న యాదగిరి అనే కాంట్రాక్టర్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ కిశోర్‌సింగ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నేరం నిరూపణ కావడంతో ఏసీబీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఏడాది కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించనట్లయితే మూడు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.

Related Stories: