మళ్లీ భారతీయ రోడ్లపై హల్‌చల్ చేయనున్న జావా

ఇప్పుడంతా రెట్రోల యుగం నడుస్తున్నది. పాతకాలపు నమూనాలకు దుమ్ముదులిపి కొచెం కొత్త టెకనాలజీని జోడించి మార్కెట్లోకి దింపడం ఇప్పటి రివాజు. బులెట్ టూవీలర్ సాధించిన అద్వితీయ విజయం బహుశ స్ఫూర్తినిచ్చినట్టుంది. ఇప్పుడు మహీంద్ర అదేదారిలో జావా బళ్లను తీసుకువస్తున్నది. ఒకప్పుడు మన మట్టిరోడ్లను దున్నేసిన ఈ బండ్లను డిస్క్ బ్రేక్‌ల వంటి తదనంతర కాలపు హంగులతో ప్రవేశపెడ్తున్నది. సుమారు 25 సంవత్సరాల తర్వాత జావా మరోసారి భారత్‌లో హల్‌చల్ చేయబోతున్నది.

మూడు 300 సీసీ జావామోడళ్లను మహీంద్ర త్వరలో విడుదల చేయనున్నది. మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర గురువారం ఈ మోడళ్లను ఆవిష్కరించారు. రుస్తంజీ గ్రూప్ సీఎండీ బొమ్మన్ రుస్తం ఇరానీ, ఫైక్యాపిటల్ అధిపతి అనుపమ్ తరేజా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు మోడళ్లలో లెజెండరీ జావా ధర రూ.1.64 లక్షలు, జావా 42 ధర రూ.1.55లక్షలు, అత్యంతఖరీదైన జావా పేరాక్ ధర రూ.1.89 లక్షలు ఉంటుందని మహీంద్రా చెప్పారు. పేరాక్ మోడల్ కొంచం ఆలస్యంగా అందుబాటులోకి వస్తుంది.

Related Stories: