మాజీ ఎమ్మెల్యే గండ్ర పై కేసు నమోదు

శాయంపేట: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. శాయంపేట మండలం మాందారిపేట గుట్టల్లో గండ్ర సోదరుడు భూపాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్‌రావు క్వారీ, క్రషర్ వ్యాపారం చేసేవారు. గొడవలు జరుగడంతో విడిపోయారు. సోమవారం రాత్రి గండ్ర, అతడి సోదరుడు భూపాల్‌రెడ్డి క్రషర్‌లోకి వస్తే చంపుతామని తుపాకీతో బెదిరించడంతో ఎర్రబెల్లి రవీందర్‌రావు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు ఆయుధచట్టం ప్రకారం ఇద్దరిపై కేసు నమోదుచేశామని ఎస్సై రాజబాబు తెలిపారు. తన క్రషర్‌లో పనిచేస్తున్న సూపర్‌వైజర్ గోవర్ధన్‌రెడ్డిని రవీందర్‌రావు తుపాకితో బెదిరించాడని భూపాల్‌రెడ్డి ఫిర్యాదుచేయడంతో రవీందర్‌రావుపైనా కేసునమోదు చేశామన్నారు.