పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలి

టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీకి ఉపాధ్యాయ ఉద్యోగసంఘం విజ్ఞప్తి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రాష్ట్రం లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన 1.30 లక్షల మందికి సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగసంఘం విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు శనివారం ఉపాధ్యా య సంఘం నేతలు టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ కే కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ రాష్ర్టాల్లో మాదిరిగానే తెలంగాణలో కూడా పాతపెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని విజ్ఞప్తిచేశారు. కేశవరావును కలిసినవారిలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ప్రధానకార్యదర్శి భూపతిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టీవీ ప్రసాద్, గణపురం సుధీర్, మాచన రఘునందన్, పుల్లారావు తదితరులు ఉన్నారు.

Related Stories: