కోణార్క వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డ ఒడిశా జర్నలిస్టు

ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని కోణార్క్ సూర్యదేవాలయం జగత్ ప్రసిద్ధి పొందింది. రాతిరథంలా ఉండే ఆ దేవాలయంపై కామశాస్త్రం తెలిపే వివిధ భంగిమల బొమ్మలుంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ ఆబొమ్మల ఫొటోతీసి, సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టి ఓ జర్నలిస్టు అడ్డంగా దొరికిపోయారు. ఒడిసా ప్రజలను ఆయన తన పోస్టుద్వారా కించపరిచారని పెద్ద దుమారమే రేగింది. అభిజిత్ అయ్యర్ మిత్రా అనే ఆ జర్నలిస్టు అరెస్టు దాకా పోయింది. చివరకు ఒడిశా అసెంబ్లీలో ఆయనను ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. ఢిల్లీలో గురువారం ఉదయం మిత్రాను అరెస్టు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆయనకు లక్షరూపాయల బాండుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే సెప్టెంబర్ 28 లోగా ఒడిశా పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అంతకుముదు చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేటు కోర్టులో ఆయనను ప్రవేశపట్టారు. మిత్రా ఆమోదయోగ్యం కాని, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారని ఒడిశా పోలీసులు మేజిస్ట్రేటుకు తెలిపారు. మూడురోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించాలని కోరారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. గత 14వ తేదీ మిత్రా ఆ వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పెట్టారు. మతాభిప్రాయాలను, గాయపర్చడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి ఆరోపణల కింద పోలీసులు ఆయనపై కేసుపెట్టారు. అంతకుముందు ఒడిశా అసెంబ్లీ మిత్రాపై సభాహక్కుల తీర్మానాన్ని ఆమోదించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు సభాకమిటీ వేయాలని కూడా నిర్ణయించింది. అన్నిపార్టీల వాళ్లు మిత్రా వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు.

Related Stories: