ఓడినా నంబర్‌వన్‌లోనే భారత్

లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-4తో చేజార్చుకున్న భారత ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులేదు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టీమ్‌ఇండియా 115 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా, సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ 105 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 125 పాయింట్లతో సిరీస్ బరిలోకి దిగిన కోహ్లీసేన భారీ ఓటమితో 10 పాయింట్లు చేజార్చుకుంది. మరోవైపు ఎనిమిది పాయింట్లు దక్కించుకున్న ఇంగ్లండ్.. న్యూజిలాండ్(102)ను వెనుకకు నెడుతూ నాలుగో ర్యాంక్‌కు ఎగబాకింది. దక్షిణాఫ్రికా(106), ఆస్ట్రేలియా(106) వరుసగా రెండు, మూడు ర్యాంక్‌ల్లో ఉన్నాయి. ఐదు పాయింట్ల తేడాతో నాలుగు జట్లు ఉన్నాయి.