నువ్వక్కడ.. నేనిక్కడ

పార్వతీశం, సిమ్రాన్ జంటగా నటిస్తున్న చిత్రం నువ్వక్కడ నేనిక్కడ. పి. లక్ష్మీనారాయణ దర్శకుడు. తాడి గనిరెడ్డి, కీర్తన వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పారస్‌జైన్ క్లాప్‌నివ్వగా, నిర్మాత కె.కె. రాధామోహన్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత ఆర్.బి.చౌదరి పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అందాలరాముడు, మంచివాడు చిత్రాల తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వినోదభరిత కథాంశంతో తెరకెక్కిస్తున్నాం.

యువతరం మనోభావాలకు అద్దం పడుతుంది. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరిలో సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. కథను, దర్శకుడిని నమ్మి చేస్తున్న సినిమా ఇదని, ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం నవ్విస్తుందని నిర్మాతలు చెప్పారు. కథానాయకుడిగా తనకు మంచి పేరును తీసుకొచ్చే చిత్రమిదని పార్వతీశం అన్నారు. రావురమేష్, పోసాని కృష్ణమురళి, నాగబాబు, రఘుబాబు, చమ్మక్‌చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గంగోత్రి విశ్వనాథ్, సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: జవహర్‌రెడ్డి.