మరో నిర్భయ.. గుజరాత్‌లో ఘోరం

ఓ మహిళపై కారులో అత్యాచారం జరిపి తోసివేసిన ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నర్సుగా పనిచేస్తున్న ఆ మహిళ మంగళవారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా శాంతుభాయ్ దర్బార్ అనే వ్యక్తి లిఫ్టు ఇస్తానని చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. కారులో అతడు ఆమెపై లైంగిక దాడికి దిగాడు. తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను కారులోంచి బైటకు తోసేశాడు. తలకు తీవ్రగాయాలైన ఆమెను దవాఖానలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.

Related Stories: