నూబియా నుంచి జడ్18 స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ నూబియా జడ్18 ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. రూ.29,350 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

నూబియా జడ్18 స్మార్ట్‌ఫోన్‌లో 5.99 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కల్పించారు. అలాగే ఈ ఫోన్‌లో అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌ను అమర్చడం వల్ల ఫోన్ అత్యుత్తమమైన ప్రదర్శనను ఇస్తుంది. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు.

నూబియా జడ్18 ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, ఫాస్ట్ చార్జింగ్.

× RELATED పొడి ప్రదేశాల్లో సైతం నీటిని పుట్టించుకోవచ్చునని..