నేడు సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఎన్టీఆర్ బ‌యోపిక్

టాలీవుడ్‌లో మ‌హాన‌టి త‌ర్వాత జనాలు ఎక్కువ ఆస‌క్తి చూపుతున్న బ‌యోపిక్ ఎన్టీఆర్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో బాల‌య్య ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుండ‌గా, ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ క‌నిపించ‌నుంది. మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిక‌రంగా చూస్తుండ‌గా, నేడు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు స‌న్నాహాలు చేసారు చిత్ర నిర్మాత‌లు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని క్రిష్ భావిస్తున్నాడ‌ట‌. తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య 64 పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఎన్టీఆర్ జీవితంలో కీల‌కంగా ఉన్న ప‌లువురు న‌టుల ఎంపిక ప్ర‌క్రియ కూడా పూర్తి అయిన‌ట్టు తెలుస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. తొలి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీతో పాటు రామ కృష్ణా థియేట‌ర్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

Related Stories: