ఎన్టీఆర్ బ‌యోపిక్ తొలి షెడ్యూల్ పూర్తి

నంద‌మూరి బాల‌కృష్ణ 103వ చిత్రంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌తో పాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తుండగా.. రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంద‌ని అంటున్నారు. తాజాగా చిత్ర తొలి షెడ్యూల్ పూర్తైంది. మరికొద్ది రోజులలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభించ‌నున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన ముఖ్య‌పాత్ర‌ల‌పై స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌నున్నారు. ఇటీవ‌ల సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇందులో బాల‌య్య కృష్ణుడి అవ‌తారంలో క‌నిపించ‌గా, ఆయ‌న ప‌క్క‌న ముర‌ళీ శ‌ర్మ ఉన్నారు. బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి చిత్ర నిర్మాతలు. 1949 జూలై 5న ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం షూటింగ్ ప్రారంభమైంది. ఓ గొప్ప చరిత్రకు శ్రీకారం జరిగిన ఆ పవిత్రమైన రోజున ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంబించారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

× RELATED ఇద్దరు అనుమానిత మావోయిస్టులు అరెస్టు