కేరళకు ఏమైంది? నిన్న వరదలు.. నేడు బీటలు!

కేరళ శతాబ్ది కాలంలోనే కనివిని ఎరుగని దారుణమైన వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కేరళలో నీటివనరులు అండుగంటుతున్నాయి. వరదరోజుల్లో నిండుకుండల్లా ఉన్న పెరియార్, భరతపుళా, పంబ, కాబిని ఇప్పుడు వట్టిపోతున్నాయి. నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. అనేకచోట్ల నేల బీటలు వారింది. బావులు అడుగంటి వసాన దశకు చేరుకుంటున్నాయి. నీటితో పొంగిపొర్లిన వాగులు వంకలు ఎండిపోయి నోళ్లు తెరుస్తున్నాయి. బావులు అడుగంటడమే కాకుండా పొడిబారి మట్టిపెళ్లలు కూలిపోతున్నాయి. ఏమిటీ విపరీతమని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ అసాధారణ పరిస్థితికి కారణమేమిటో కనుక్కోమని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ మండలిని ఆదేశించారు. జీవవైవిధ్యానికి పేరెన్నిక గన్న వయనాడ్ జిల్లాలో ఇటీవల పెద్దఎత్తున వానపాములు మృతి చెందడం రైతులను కలతకు గురిచేసింది. భూసారం నష్టానికి ఇది నిదర్శనమని పర్యావరణవాదులు అంటున్నారు.
× RELATED కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158