నోటా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న విజ‌య దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్‌, నోటా అనే సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టించిన‌ గీతా గోవిందం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి భారీ విజ‌యం సాధించింది. ఆయ‌న న‌టించిన మ‌రో చిత్రం ట్యాక్సీవాలా విడుద‌ల‌కి సిద్ధం అయింది. అయితే ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజ‌య్ చేస్తున్న బైలింగ్యువ‌ల్ మూవీ ‘నోటా’ థియేట్ర‌కిల్ ట్రైల‌ర్‌ని సెప్టెంబ‌ర్ 6 సాయంత్రం 4గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్నారు. పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది చిత్ర బృందం. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్‌ చేతి వేలుపై ఓటేసిన సిరా గుర్తుతో కనిపించాడు. కేఈ జ్ఞాన్‌వేల్ రాజా సమర్పణలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో మెహ‌రీన్ కౌర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ త‌దిత‌రులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌లో ఈ కుర్ర హీరో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడ‌ని చెబుతున్నారు.

Related Stories: