దుమ్ము రేపుతున్న 'నోటా'ట్రైల‌ర్

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా 'నోటా' సినిమా రూపొందుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చేతి వేలుపై ఓటేసిన సిరా గుర్తుతో కనిపించిన విజ‌య్ తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌లో స‌రికొత్త‌గా క‌నిపించాడు. సాధార‌ణ యువ‌కుడిగాను, ముఖ్య‌మంత్రిగాను ట్రైల‌ర్‌లో క‌నిపించాడు విజ‌య్ దేవ‌రకొండ‌. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌లో 'ఇది ముఖ్యమంత్రి పదవా .. మ్యూజికల్ చైర్ ఆటా?' అంటూ మెహ్రీన్ చెప్పిన డైలాగ్, 'ఒక స్టేట్ ఫ్యూచర్ అంతా ఒక స్వామిజీ చేతుల్లోనా?' అనే విజయ్ దేవరకొండ డైలాగ్ , 'ఈ గేమ్ లో నువ్వు చూసే రక్తం నిజం .. నీ శత్రువులు నిజం .. ఆడటం మొదలు పెట్టావో ఆపడం నీ చేతుల్లో వుండదు .. లైఫ్ ఆర్ డెత్' అంటూ నాజర్ చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. మెహ‌రీన్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. స‌త్య‌రాజ్‌, ముఖ్య పాత్ర‌ల‌లో అద‌ర‌గొట్ట‌నున్నారు. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 4న సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Related Stories: