స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ అమలు

హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరిగే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్రఎన్నికల సంఘం నిర్ణయించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. స్థానికంగా జరిగే అన్ని ఎన్నికల్లోనూ దానిని ప్రవేశపెట్టాలని ఇటీవల రాష్ర్టాల ఎన్నికల సంఘాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికలకు ఉపయోగించే ఈవీఎంలలో నోటా విధానాన్ని అమలుచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నది.

తెలంగాణలో మొదటిసారిగా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దీనిని అమలుచేశారు. నోటాకు వచ్చిన ఓట్లను కేవలం గణనలోకి మాత్రమే తీసుకుంటామని, పోటీచేసిన అభ్యర్థుల గెలుపోటములకు సంబంధంలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. గెలుపొందిన అభ్యర్థికి ఈ విధానంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఈ విషయమై కొన్ని సివిల్ సొసైటీలు కేంద్రఎన్నికల సంఘానికి పలు రకాల సూచనలు, సలహాలు చేశాయని వివరించారు.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు