నోటాకు 4 లక్షల ఓట్లు !

అహ్మాదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో ఓ రకంగా నోటా కూడా గెలిచింది. ఎందుకంటే ఆ ఆప్షన్.. కొన్ని జాతీయ పార్టీల కంటే ఎక్కువే ఓట్లు సంపాదించింది. అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్ తన ఓటును నోటాకు సమర్పించే ఆప్షన్ ఇటీవల ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో నన్ ఆప ద ఎబోవ్(నోటా) మీట నొక్కిన వారి సంఖ్య సుమారు నాలుగు లక్షలు దాటింది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో నోటాకు సుమారు 2 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ఇది ఎంత అంటే బీఎస్పీ, ఎన్‌సీపీ పడ్డ ఓట్ల కంటే ఎక్కువే అని అధికారులు అంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోవడంతో ఓటర్.. నోటాను ఆదరించినట్లు తెలుస్తున్నది. సోమ్‌నాథ్, నారణ్‌పురా, గాంధీధామ్ నియోజకవర్గాల్లో పార్టీల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఒక్క పోర్‌బందర్‌లోనే సుమారు 3433 ఓట్లు నోటాకు దక్కాయి.
× RELATED నామినేషన్ల చివరి రోజు కూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్